Sunday, March 28, 2010

ఝుమ్మంది నాదం ...

  శ్రీశ్రీ గారు ముందెప్పుడో అన్నారు అగ్గిపెట్టె, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల , కాదేది కవితకనర్హం అని. అలానే మహదేవన్ గారు సంగీతానికేది అనర్హం కాదు అని చెప్పడానికా అన్నట్టు న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కి కూడా చక్కగా ట్యూన్ కట్టేసేవారట. సిరివెన్నల సీతారామశాస్త్రి గారు నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం అని రాసినట్టు నిజమైన కళాకారులకి ఊపిరి నిండా ఆ కళే ఉంటుందేమో! అదే ఆ కళ సంగీతమయితే వేసే ప్రతి అడుగూ కూడ హార్మోనియం మెట్టు లాగ రాగం పలుకుతుంది. ఉచ్చ్వాస నిశ్వాసాలు కూడా రాగాలకు ఉనికిపట్టు అవుతాయి. కాబట్టి మహదేవన్ గారు న్యూస్ పేపర్ ఎడిటోరియల్ని రాగయుక్తంగా  పాడేవారంటే  అందులో ఆశ్చర్య పోవాల్సిన్దేమి లేదనుకుంటా..



No comments:

Post a Comment