Sunday, March 28, 2010

ఝుమ్మంది నాదం ...

  శ్రీశ్రీ గారు ముందెప్పుడో అన్నారు అగ్గిపెట్టె, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల , కాదేది కవితకనర్హం అని. అలానే మహదేవన్ గారు సంగీతానికేది అనర్హం కాదు అని చెప్పడానికా అన్నట్టు న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కి కూడా చక్కగా ట్యూన్ కట్టేసేవారట. సిరివెన్నల సీతారామశాస్త్రి గారు నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం అని రాసినట్టు నిజమైన కళాకారులకి ఊపిరి నిండా ఆ కళే ఉంటుందేమో! అదే ఆ కళ సంగీతమయితే వేసే ప్రతి అడుగూ కూడ హార్మోనియం మెట్టు లాగ రాగం పలుకుతుంది. ఉచ్చ్వాస నిశ్వాసాలు కూడా రాగాలకు ఉనికిపట్టు అవుతాయి. కాబట్టి మహదేవన్ గారు న్యూస్ పేపర్ ఎడిటోరియల్ని రాగయుక్తంగా  పాడేవారంటే  అందులో ఆశ్చర్య పోవాల్సిన్దేమి లేదనుకుంటా..



Thursday, March 25, 2010

దేవులపల్లి part 2

రిన్ని దేవులపల్లి పాటలని మళ్లీ మోసుకొచ్చింది మీ పాటలపల్లకి ఈ పోస్ట్ లో!




ఇంకొక అందమైన టాపిక్ తో ఇంకొక పోస్ట్ లో మళ్లీ కలిసే వరకు... ఇంతే సంగతులు.. చిత్తగించవలెను.

Tuesday, March 23, 2010

దేవులపల్లి part 1

 పాటలపల్లకి pilot episode విని ఆదరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్..  పాటలపల్లకి ఈ పోస్ట్ ని నేను dedicate చేస్తున్నాను.. నాకెంతో ఇష్టమైన కవి , భావుకత కి చిరునామా అయిన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి. మరి ఇంకెందుకు ఆలస్యం? అద్భుతమైన భావుకత్వం లో అలుపెరుగని ఆనందాన్ని ఆస్వాదిద్దాం!





వీనుల విందైన సంగీతాన్ని.. అంత కన్నా ఇంపైన సాహిత్యాన్ని ఆనందించారని ఆశిస్తాను. There is more to come! Please stay tuned for devulapalli part 2.


పాటలలో పూలు

పాటలపల్లకి ని మళ్లీ పలికించాలని చాలా రోజుల తర్వాత అనిపించింది.. వినసొంపైన సంగీతాన్ని అనసొంపైన సాహిత్యాన్ని కలిగి ఉన్న పాటల మీద నాకు ఉన్న ప్రేమ ని పది మందిని పంచుకోవాలనే తాపత్రయం తోనే అప్పట్లో TORI లో పాటలపల్లకి చేసేదాన్ని.. ఇప్పుడు మళ్లీ పాటలపల్లకి ని ఈ బ్లాగ్ రూపం లో అందరి ముందుకి తీసుకుని వస్తున్నాను... Hope the listeners enjoy it! తొలి ప్రయత్నంగా ఈ చిన్న pilot episode.




ఈ రోజు పాటల పల్లకి ఈ మజిలి లో మనం బస చెయ్యబోతున్నాం ... పూల తోటలో ... సన్నజాజులు , ముద్దబంతులు , సిరి మల్లెలు , మొగలి పువ్వులు , చామంతులు విరిదొంతులు , తోటలలోనే కదండీ , పాటల్లో కూడా గుబాళిస్తాయి! మరి అలాంటి కొన్ని పూల పరిమళాలని మోసుకొచ్చింది పాటలపల్లకి ఈ పోస్ట్ లో మీ కోసం ! తెలుగు సినిమా పాటలలో ఏదైనా పువ్వు పేరు పల్లవి లో ఉన్న పాటలలో కొన్నిటిని ఏరి , మాల గుచ్చి తీసుకొచ్చాను మీ కోసం ...